![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -848 లో.....నా నిర్ణయం అయితే నేను మార్చుకోను. కావ్యని ఎలా ఒప్పిస్తారో నాకు తెలియదు కానీ నేను చెప్పింది చెయ్యాలని రాజ్ తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఇక గొడవలు అయితే మాత్రం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు అప్పు జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంది. అత్తయ్య అన్ని మాటలు అంటుందిని కళ్యాణ్ తో అప్పు చెప్తూ బాధపడుతుంది. అసలు అలా వదినని అమ్మ అన్ని మాటలు అనడానికి కారణం నువ్వే.. నువ్వు సరిగ్గా భోజనం చెయ్యకపోవడంతో నీ కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని అమ్మ అంటుందని అప్పుతో కళ్యాణ్ అంటాడు.
ఇక జరిగింది చాలు అక్కకి నిజం చెప్తానని అప్పు వెళ్తుంటే వద్దు అన్నయ్య చెప్పకుండా అబార్షన్ చెయ్యాలని చేస్తూన్నాడు కదా.. ఇప్పుడు నువ్వు చెప్తే ఎలా అని అప్పుని కళ్యాణ్ ఆపుతాడు. నువ్వు ఈ జ్యూస్ తాగు లేదంటే అమ్మ మళ్ళీ గొడవ చేస్తుందనగానే అప్పు తాగుతుంది. మరొకవైపు రాజ్ మారేలా లేడని ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి తన గదిలో పెట్టి వెళ్లిపోతుంది. మరుసటి రోజు పనిమనిషి రూమ్ క్లీన్ చేస్తుంటే ఆ లెటర్ బయట పడుతుంది. అది చూసి అపర్ణ చదువుతుంది. కావ్య వెళ్ళిపోయిందని తెలుసుకొని షాక్ అవుతుంది.
ఇంట్లో అందరిని పిలిచి విషయం చెప్తుంది. నీ వల్లే నా కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని రాజ్ పై అపర్ణ కోప్పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని రుద్రాణి అంటుంది. దాంతో సుభాష్ తనపై కోప్పడతాడు. కావ్య ఖచ్చితంగా తన పుట్టింటికి వెళ్లి ఉంటుంది అపర్ణ, నువ్వు కనకం కి కాల్ చెయ్యమని సుభాష్ చెప్తాడు. మరొకవైపు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది. అల్లుడు గారు రాలేదా అని కనకం అడుగుతుంది. తరువాయి భాగంలో కావ్య కోసం కనకం ఇంటికి రాజ్ వస్తాడు. మీ నిర్ణయం మార్చుకుంటేనే నేను వస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |